పలమనేరు :పోలీస్ స్టేషన్ నందు బుధవారం డివిజనల్ డిఎస్పి డేగల ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. నెల్లూరు నుంచి గంజాయి తీసుకొని వస్తున్నారని పక్కా సమాచారం రావడంతో పలమనేరు ఆంజనేయ స్వామి గుడి వద్ద నెల్లూరు నుంచి వస్తున్న బస్సులు సోదా చెయ్యగా, నలుగురి వద్ద 4కేజీ గంజాయి ఉన్నట్లు గుర్తించి వీరిని అదుపులోకి తీసుకొని విచారించామన్నారు. నెల్లూరుకు చెందిన వ్యక్తి దగ్గర నుంచి తీసుకొస్తున్నామని సమాచారం ఇవ్వడం జరిగింది. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే వీరికి సప్లై చేస్తున్నటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకుంటామన్నారు.