కరీంనగర్ సిరిసిల్ల ప్రధాన రహదారి చింతకుంట బ్రిడ్జ్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయినట్లు స్థానికులు గురువారం తెలిపారు. చింతకుంట ప్రధాన రహదారిపై రోడ్ రిపేర్ చేస్తుండడం, అదే సమయంలో ఓ వ్యాన్ మోరాయించడం తో భారీగా ట్రాఫిక్ జామ్ అయినట్లు తెలిపారు. సుమారు గంటకు పైగా ప్రధాన రహదారిపై ట్రాఫిక్ జామ్ కావడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. జగిత్యాల బైపాస్ కూడా అక్కడే ఉండడంతో భారీ వాహనాలు కూడా భారీ సంఖ్యలో నిలిచిపోయాయి.సమాచారం అందుకున్న కొత్తపల్లి సీఐ బిల్లా కోటేష్ చేరుకొని గంటకు పైగా శ్రమించి ట్రాఫిక్ ని పోలీసులు క్రమబద్ధీకరించారు.