నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రంలో తీజ్ పండుగ ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని 16 తండాలకు చెందిన పెద్దమనుషుల ఆధ్వర్యంలో మండల కేంద్రంలో తీజ్ పండగ సంబరాలు జరుపుకున్నారు. తీజ్ పండుగ వేడుకల్లో యువతీ యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డీజే చెప్పులకు నృత్యాలు చేస్తూ ఆనందోత్సవాలతో గడిపారు.