మడకశిర మండలం చందకచెర్లలో ప్రసిద్ధి చెందిన ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణమాసం చివరివారం అమావాస్య కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి పూజల్లో పాల్గొనడం జరిగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలక్కుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు.