ముదిగుబ్బ మండలంలో పంటలు నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పంట నష్టపరిహారం తక్షణమే చెల్లించాలని మండల సిపిఐ కార్యదర్శి చల్లా శ్రీనివాసులు శుక్రవారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల నుండి ఫసల్ బీమా పేరుతో డబ్బులు కట్టించుకుని నష్టపోయిన పంటలకు ఇన్సూరెన్స్ ఇవ్వకపోవడం సమంజసంగా లేదని హెచ్చరించారు. నాలుగు సంవత్సరాలుగా వివిధ రకాల కారణాలతో పంటలు నష్టపోతున్నారని ఇంతవరకు క్రాప్ ఇన్సూరెన్స్ రైతులకు ఎందుకు ఇవ్వడం లేదన్నారు.