శ్రీకాకుళం జిల్లా మందస మండలం బాలిగాం గ్రామ సమీప జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం 6 గంటలకు రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మందస మండలం జి ఆర్ పురం గ్రామానికి చెందిన తండ్రి కొడుకులు శాసుమాన మోహనరావు, నరసింహులు ద్విచక్ర వాహనంతో రోడ్డు పక్కన ఆగి ఉండగా... వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో తండ్రి మోహనరావు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా... కుమారుడు నరసింహులు తీవ్ర గాయాల పాలయ్యాడు. విషయం తెలుసుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది గాయపడి వ్యక్తిని చికిత్స నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన పై మందస పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.