అనంతపురం జిల్లా గుత్తి మండల పరిధిలోని జక్కలచెరువు గ్రామ శివారులో 67వ జాతీయ రహదారిపై శనివారం రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గుత్తి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని గొందిపల్లి గ్రామానికి చెందిన పద్మనాభరెడ్డి పని నిమిత్తం రాయలచెరువుకు వెళ్లాడు. అక్కడ పని ముగించుకొని తిరిగి గొందిపల్లి గ్రామానికి వెళ్తుండగా జక్కలచెరువు శివారులో గుత్తి నుంచి యాడికికి వెళ్తున్న దంపతులు ద్విచక్రవాహనం వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో పద్మనాభరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన చికిత్సలకు అనంతపురంకు తీసుకెళ్ళారు.