వరంగల్ నగరంలోని పోచమ్మ మైదాన్ లోని జకోటియా కాంప్లెక్స్ వద్ద ఈరోజు సోమవారం సాయంత్రం జరిగిన కిడ్నాప్ ను పోలీసులు ఛేదించారు. ఆన్లైన్ బెట్టింగుకు అలవాటున్న యువకుడే తాను కిడ్నాప్ అయినట్టు డ్రామా ఆడాడు. అయితే అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు అసలు విషయాన్ని కనిపెట్టి డ్రామాకు తెరదించారు. ఆన్లైన్ బెట్టింగుల్లో డబ్బు పోగొట్టుకొని అప్పలపాలైన యువకుడు కిడ్నాప్ డ్రామా అడగ ఆ యువకుని ఆట కట్టించారు మట్టేవాడ పోలీసులు.