విపరీతమైన ప్లాస్టిక్ వాడకం కారణంగా వాతావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతున్న నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన గిరీష్ కౌటిక్వార్ వినూత్న ఆలోచన చేశారు. మంగళవారం తన కుమారుడి పెళ్లి సందర్భంగా నిర్వహించిన పసుపుబొట్టు కార్యక్రమంలో ప్లాస్టిక్ వస్తువులకు బదులుగా వెదురుతో తయారు చేసిన వస్తువులను వినియోగించారు. ప్లాస్టిక్ తో కాలుష్యం పెరుగుతున్నందున తమ వంతుగా చిన్న ప్రయత్నం చేసినట్లు గిరీష్ తెలిపారు. పెళ్లి వేడుకల్లో వీలున్నంత మట్టుకు ప్లాస్టిక్ ను నిషేధించామని తెలిపారు.