రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా వైద్య సమస్యల్లో మౌలిక వసతులు మెరుగు కోసం ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తున్నదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. శనివారం జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లాలోని కేజీబీవీ మోడల్ స్కూల్ రెసిడెన్షియల్ పాఠశాలలో సిఎస్ఆర్ నిధులతో చేపట్టిన మౌలిక వసతుల కల్పనపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్య వైద్య రంగాల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఆఫీసర్లు పాల్గొన్నారు.