భర్త చిత్రహింసలు పెడుతున్నాడని భార్య ఆత్మహత్యాయత్నం భర్త భార్య పిల్లల్ని పట్టించుకోకుండా చిత్రహింసలకు గురి చేస్తున్నాడు అన్న బాధతో ఓ మహిళ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఘటనపై బాధితురాలు కుటుంబీకులు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కురబలకోట మండలంలోని సర్కారు తోపుకు చెందిన విజయ్ కుమార్ తన భార్య జ్యోతి 27 ను, భర్త పట్టించుకోకుండా చిత్రహింసలు పెడుతున్నాడని మనస్థాపం చెంది, నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబీకులు ఆమెను మదనపల్లికి తరలించగా చికిత్స పొందుతోంది.