ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అనంతపురం జిల్లా పర్యటన నేపథ్యంలో ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో నగరంలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న విజేత మార్ట్ పక్కన, కేశవరెడ్డి స్కూల్ లో, సంఘమిత్ర నగర్ ఎక్స్టెన్షన్, వివిఐపి, విఐపి పార్కింగ్, తదితర 15 ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న పలు పార్కింగ్ స్థలాలలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పార్కింగ్ స్థలాల్లో ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. పార్కింగ్ స్థలాలను శుభ్రం చేయాలని, రోలింగ్ చేయడం, పోల్స్ తొలగించాలన్నారు.