చాకలి ఐలమ్మను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని రజక సంఘం జన్నారం మండల నాయకులు అన్నారు. ఐలమ్మ వర్ధంతి సందర్భంగా బుధవారం జన్నారం మండల కేంద్రంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రజక సంఘం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ గడ్డపై భూమి కోసం,భుక్తి కోసం,పీడిత ప్రజల విముక్తి కోసం అలుపెరుగని పోరాటాలు చేసిన వీర వనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. ఆమె ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షుడు నల్లూరి పెద్దన్న,ప్రధాన కార్యదర్శి కుదురుపాక నరేశ్,కమిటీ సభ్యులు రాజన్న,రమేశ్,సత్యం,మల్లేశ్ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.