గోనెగండ్లలో డెంగ్యూ కేసు నమోదు.గోనెగండ్ల సచివాలయం-2 పరిధిలో డెంగ్యూ కేసు నమోదైంది. దీంతో వైద్య సిబ్బంది అప్రమతమయ్యారు. కేసు నమోదైన ప్రాంతంలో దోమల నివారణ మందును పిచికారీ చేశారు. SUO కృష్ణుడు, ఎంపీహెచ్ఓ హనుమంతు, ఎంపీహెచ్ఎస్ పరమేశ్ మాట్లాడారు. ప్రజలు ఇళ్ల ముందు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అపరిశుభ్రత వల్ల దోమలు వ్యాప్తి చెంది, మలేరియా, డెంగ్యూ తదితర రోగాలు దరి చేరుతాయన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సతీశ్ పాల్గొన్నారు.