బాల్కొండ మండల కేంద్రంలో గల పాండురంగ ఫంక్షన్ హాల్ లో బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం వెంకటేష్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకువెళ్తూ రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అనుసరించే విధానాన్ని చర్చించాము స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.