కడిగిరి పట్టణంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో వర్షాకాలపు పరిశుభ్రతపై విద్యార్థులకు మున్సిపల్ కమిషనర్ పి కృష్ణమోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ శనివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. హ్యాండ్ వాష్ పై అవగాహన కల్పించి, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోకపోతే వచ్చే వ్యాధుల ను తెలియజేశారు . కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.