చుండూరు దళిత పల్లె వీరులు పేరుతో బ్రాడీపేట సీపీఎం కార్యాలయంలో బుధవారం సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు కె.వినయకుమార్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. దళిత, గిరిజనుల హక్కుల పరిరక్షణలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పాత్రపై చర్చించారు. చుండూరు పోరాటంలో ప్రాణత్యాగం చేసిన వారి జీవితాలు ఆదర్శమని, వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని నేతలు పేర్కొన్నారు. ప్రభుత్వం కూడా వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.