లక్ష్మణచందా మండలం కనకాపూర్ గ్రామం వద్ద ద్విచక్ర వాహనం, లారీ ఢీకొని యువకుడు మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. మామడ మండలం నల్దుర్తి గ్రామానికి చెందిన ఉదయ్ అనే యువకుడు మంగళవారం ద్విచక్రహనంపై నిర్మల్ వైపు వెళుతున్నాడు. కనకాపూర్ గ్రామ సమీపంలో లారీ బైక్ ఎదురెదురుగా వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఉదయ్ తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.