బాపట్ల పట్టణంలోని గ్రోమోర్ ఎరువుల దుకాణాన్ని జిల్లా కలెక్టర్ వెంకట మురళి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణంలో ఉన్న స్టాక్, రికార్డులను పరిశీలించిన కలెక్టర్, ప్రస్తుతం ఉన్న స్టాక్, ఇండెంట్ వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గ్రోమోర్ దుకాణం నుంచి ఆర్ఎస్ కే కేంద్రాలకు సకాలంలో ఎరువులు పంపిణీ చేయాలని సూచించారు. అలసత్వం వహిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. రైతులకు సక్రమంగా ఎరువులు అందేలా చూడాలని అధికారులకు సూచించారు.