కాకినాడ జిల్లా పెద్దాపురం, రామారావు పేట లో గల శ్రీ ప్రకాశ్ సినర్జీ పాఠశాలలో, జూలై 25వ తేదీ నుండి ఆగస్టు మూడవ తేదీ వరకు జరుగుతున్న రైఫిల్ షూటింగ్ శిక్షణను,ఆంధ్ర-తెలంగాణ డైరెక్టరేట్,NCC డిప్యూటీ డైరెక్టర్ జనరల్,ఎయిర్ కమాండర్ నర్సింగ్ సైలాని గురువారం సాయంత్రం 7.30నిమిషాల సమయంలో పరిశీలించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ- ఆంధ్ర రాష్ట్రాల నుండి 70 మంది క్రీడాకారులు రైఫీల్ షూటింగ్లో స్థానిక శ్రీ ప్రకాష్ సినర్జీ పాఠశాలలో సిక్షన పొందుతున్నట్లు తెలిపారు,శిక్షణ అనంతరం వీరిలో నుండి 20మందిని ఎంపిక చేసి కోలాపూర్ లో జరిగే జాతీయస్థాయి ఛాంపియన్షిప్ పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.