కామారెడ్డి : పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం కళాశాల ఎదురుగా నిరసన వ్యక్తం చేశారు. సిపిఎస్ విధానానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసన కార్యక్రమాలకు మద్దతుగా కళాశాలలో సైతం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన కళాశాల ప్రిన్సిపాల్ డా.కె.విజయ్ కుమార్ మాట్లాడుతూ 'సిపిఎస్ వద్దని ఒపిఎస్ విధానం ద్వారానే ప్రభుత్వ ఉద్యోగులకు భవిష్యత్తు మీద, భరోసా ఉంటుందని., రిటైర్మెంట్ అనంతర జీవితం గురించి చింత ఉండదని" అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే కిష్టయ్య, ఐక