అవనిగడ్డ మండలం పాత ఎడ్లంక గ్రామస్తులు చేస్తున్న నిరసన దీక్ష 3వ రోజుకి చేరుకుంది. కట్టుకున్న ఇల్లు కూలిపోయి గ్రామం కోతకు గురవుతూ ఊరు కొట్టుకుపోవడానికి సిద్ధంగా ఉంటే తమను ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. గ్రామస్థుడు కృష్ణాజిల్లా మాలమహానాడు నేత దోవా గోవర్ధన్ మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు అధికారులు ఎడ్లంక సమస్యను నిర్లక్ష్యం చైయ్యడం తగదని అన్నారు. గ్రామంలో తీవ్ర ఆందోళ నెలకొని ఊందని అక్కడి ప్రజలు సరిగ్గా నిద్రకూడా పోకుండా కాలం వెళ్ళదీస్తున్నారని అన్నారు.