పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం మండలంలో అన్ని గ్రామాలలో బుధవారం విస్తరంగా వర్షం కురుస్తోంది. పోడూరు, కవిటం, పీ.పోలవరం, జగన్నాధపురం, వేడంగి, పండితవిల్లూరు, మంగలిపాలెం తూర్పుపాలెం తదితర గ్రామాలలో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. దీంతో వినాయక చవితి పండుగ సందర్భంగా వివిధ ప్రాంతాలకు వెళ్లేవారు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.