గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడి గ్రామంలో వినాయక ప్రతిమ ఊరేగింపులో శనివారం అపశ్రుతి చోటుచేసుకుంది. ఊరేగింపు సమయంలో బాణాసంచా ప్రమాదంలో కురగంటి పేరయ్య అనే వృద్ధుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతన్ని వెంటనే తుళ్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. విగ్రహానికి అనుమతి ఉందా లేదా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.