ప్రకృతి వ్యవసాయ విభాగం వారు నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ కింద గుర్తించిన 170 క్లస్టర్లలో అమలు చేయనున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాల విధివిధానాలపై జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కలెక్టర్కు వివరించారు. గతంలో 174 గ్రామ పంచాయతీలలో ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలు అమలయ్యాయన్నారు. కొత్తగా 273 గ్రామపంచాయతీలలో ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలను అమలు చేయడానికి ప్రణాళికలు రూపొందించామన్నారు.