సదాశివనగర్ మండలం జాతీయ రహదారి కుప్రియల్ వద్ద మంగళవారం రాత్రి 10 గంటలకు గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరికి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన వంకాయల రవి అనే వ్యక్తి వెంటనే 108 అంబులెన్స్ కు సమాచారం ఇచ్చాడు. అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. వీరు ద్విచక్ర వాహనంపై కామారెడ్డి నుండి సదాశివ నగర్ వెళ్తుండగా ఈ ప్రమాదం కుప్రియల్ వద్ద చోటుచేసుకుందని తెలిపారు. మృతి చెందిన వ్యక్తి మ్యాదరి బాలయ్య పద్మ జీవాడి గ్రామంగా తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.