పాడేరు మండలం చింతల విధి సమీపంలో ఆదివారం సాయంత్రం వినాయక విగ్రహ నిమజ్జన ఊరేగింపు పై స్కార్పియో దూసుకొచ్చి ఢీ కొట్టిన ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ శ్రీమతి జల్లపల్లి సుభద్ర గారు సోమవారం పరామర్శించారు. కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న వంతల దాలిమా, కొర్ర విశ్వ లను పరామర్శించే ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. వీరితో పాటు దోడుపుట్టు సర్పంచ్ తండ్రి హార్ట్ స్ట్రోక్ తో బాధపడుతూ చికిత్స పొందుతున్న చందోర్ ను పరామర్శించారు