రాజన్న సిరిసిల్ల ,జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ లో సిపిఐ ఆధ్వర్యంలో సురవరం సుధాకర్ రెడ్డి సంతాప సభను నిర్వహించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు మాట్లాడుతూ విప్లవ ధ్రువతార, కమ్యూనిస్టు దిగ్గజం సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఉత్తమ పార్లమెంట్ సభ్యుడు సిపిఐ సురవరం సుధాకర్ రెడ్డి మరణం వామపక్ష, ప్రజాస్వామ్య ఉద్యమాలకు తీరం లోటు అని అన్నారు. అనారోగ్యంతో మృతి చెందడం తీవ్ర లోటు అని భారత ప్రజలు ఒక గొప్ప నాయకుడు కోల్పోయారని తెలిపారు. ఆయన విద్యార్థి దశనుండే సిపిఐ కి ఆకర్షితులై ఎర్రజెండా చేతబట్టి పేద ప్రజల సమస్యలపై సమరశీల పోరాటాలను కొనసాగి