తుళ్లూరులో అమరావతి రాజధాని జేఏసీ గురువారం కీలక సమావేశం నిర్వహించింది. గతంలో 15 అంశాలపై మంత్రి నారాయణ, సీఆర్డీఏ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా, కేవలం రెండు, మూడిటిపైనే చర్యలు తీసుకున్నారని జేఏసీ నాయకులు తెలిపారు. దీనిపై మరల మంత్రి నారాయణ, సీఆర్డీఏ అధికారులను కలిసి చర్చిస్తామని వారు పేర్కొన్నారు. రాజధాని ప్రాంత రైతుల సమస్యలను అధికారులు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.