సిపిఐ 24వ మహాసభలను ఆగస్టు 9, 10, 11 తేదీల్లో కర్నూలులో ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జగన్నాథం తెలిపారు. ఈ మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ సోమవారం సిపిఐ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీ కర్నూలు కలెక్టర్ కార్యాలయం నుంచి ప్రారంభమై రాజు విహార్, కంట్రోల్ రూమ్, మున్సిపల్ కార్యాలయం, సుందరయ్య సర్కిల్, ఓల్డ్ బస్టాండ్ వరకు కొనసాగింది. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాసభలకు మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జగన్నాథం గారు, “దేశ ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో అభివృద్ధి అన్నదే కనబడలేదు. సామాన్య ప్రజల సమస్