మందమర్రి మండలంలోని రామకృష్ణాపూర్ పట్టణంలో మిలాధ్ ఉన్ నబీ వేడుకలు జామ మసీద్ ముస్లిం సోదరులు ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఆర్కే1 మసీద్ ఏరియా నుండి ముస్లిం సోదరులు ద్విచక్ర వాహనాలతో పుర వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటి సభ్యులు మాట్లాడుతూ మహ్మద్ ప్రవక్త జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పట్టణ ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని అల్లాను ప్రార్థించారు.