మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని వేలాల గ్రామ సమీపంలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదలడంతో వరద పెరిగింది. గోదావరి సమీపంలోని పత్తి చేనుల్లో గోదావరి వరద నీరు చేరింది. వేలాల గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి వివేక్ వెంకటస్వామి గురువారం సాయంత్రం తెలిపారు. స్థానిక అధికారులు గ్రామ ప్రజలను అప్రమత్తం చేయాలని వరద ఉధృతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజలెవరూ వరద ప్రాంతాలకు వెళ్లకూడదని, అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు.