మీర్చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాలిఖబర్లో కొండచిలువ కనిపించి కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో పోలీసులు స్నేక్ సొసైటీకి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సొసైటీ సభ్యులు కొండచిలువను పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు