నూజివీడు మండలం రావిచర్ల గ్రామంలో త్రైత సిద్ధాంతకర్త శ్రీ ప్రబోధానంద యోగీశ్వరుల ఆశీస్సులు, ఇందు జ్ఞాన బోధ వేదిక సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు శ్రీ కృష్ణాష్టమి ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. AMC మాజీ చైర్మన్, రావిచెర్ల సర్పంచ్ కాపా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏటా శ్రీ కృష్ణాష్టమి వేడుకలను 11 రోజుల పాటు నిర్వహించటం ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం అన్నారు. శ్రీకృష్ణుడు జగతికి తెలిపిన భగవద్గీత ధర్మాలు, సూత్రాలు, ప్రబోధాలు, సూక్తులను ప్రపంచానికి చాటి చెప్పడమే లక్ష్యంగా పేర్కొన్నారు. కుల మతాలకు అతీతంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు నిర్వ