మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ 22 వార్షికోత్సవాన్ని పాత గాజువాక జంక్షన్లో నిర్వహించారు. మానవతా గాజువాక కన్వీనర్ బిజెపి గాజువాక అధ్యక్షులు దీనంకొండ కృష్ణంరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు కరణం రెడ్డి నర్సింగరావు పాల్గొని మానవతా సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ ద్వారా 800 పైగా అనాధ శవాలను దానకాండ చేశామని అలాగే 20 పైగా గుర్తు తెలియని సవాలను గుర్తించి వారికి కూడా ధమలకాండ చేశామని అలాగే మా సంస్థ ద్వారా ఉచితంగా అంతిమరదం మరియు బాడీలను దాచుకోవడానికి ఫ్రీజర్లను ఏర్పాటు చేస్తామని అన్నారు.