సంతనూతలపాడు మండలంలోని వేములపాడు అంగన్వాడీ కేంద్రంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో గర్భవతులు, బాలింతలకు పౌష్టికాహార వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ ప్రాజెక్టు సూపర్వైజర్ పార్వతి భాయ్ మాట్లాడుతూ.... పౌష్టికాహార లోపం వల్ల కలిగే అనర్ధాలను వివరించారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందించే ఐరన్ టాబ్లెట్లను తప్పనిసరిగా వినియోగించుకోవాలని గర్భవతులు, బాలింతలకు సూచించారు. ప్రతిరోజు ఆహారంలో కోడిగుడ్లు, ఆకుకూరలు, పాలు ఉండేవిధంగా చూసుకోవాలన్నారు.