ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించుకోవాలని, ప్రయివేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యా బోధన చేయాలని రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం మిరుదొడ్డి మండలంలోని మల్లుపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో సరస్వతి విగ్రహాన్ని ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ.. సరస్వతీ విగ్రహాలతో పాటు భారత దేశ మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయురాలు చదువుల తల్లి సావిత్రి బాయి పూలే విగ్రహాలను సైతం పాఠశాల అవరణలో పెట్టాలని కోరారు. కుల మతాలకు అతీతంగా ఉండాలని తరగతి గదే విద్యార్థుల భవిష్యత్ నిర్మిస్తుందని చె