ఈనెల 29న పార్వతీపురం -విశాఖ వెళ్లే బస్సులో సీటు కోసం ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ వీడియో రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ గా మారింది. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పార్వతీపురం డిపో అధికారులు మహిళతో పాటు సదరు వ్యక్తిపై చర్యలకు ఉపక్రమించారు. బూతులు తిట్టుకుంటూ పరస్పరం దాడి చేసుకుంటూ ఇతర ప్రయాణికులను ఇబ్బందికి గురి చేశారు. ఆర్టీసీ పరువుకు భంగం కలిగించిన వారిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు డిపో మేనేజర్ కనకదుర్గ తెలిపారు.