నగరంలోని వినాయక్ నగర్, భవాని నగర్లలో గత మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వర్షపు నీరు ఇళ్లలోకి రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.. ఈ సందర్భంగా కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మంచే శివరాజం మాట్లాడుతూ వర్షాకాలం రాగానే తమ ప్రాంతంలో వర్షపు నీరు నిలువ ఉండి ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నామని అన్నారు. సంబంధిత అధికారులకు గతంలో గాని ఇప్పుడు గాని వేడుకున్న ప్రయోజనం లేకపోతుందని ఆయన ఆవేదనన్ని వ్యక్తం చేశారు.ఇకనైనా అధికారులు మేల్కొని కాలనీ వాసుల క్షేమం కోసం మురికి నీరు విషయంలో, దోమల బెడద విషయంలో ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.