విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దటంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. శుక్రవారం ఆయన నివాసం వద్ద రక్షా దళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపూజోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా, మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు (చినబాబు) పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం, పలువురు ఉపాధ్యాయులకు పండ్లు, వస్త్రాలు అందజేసి, శాలువాతో సత్కరించారు.