బైక్ ఢీ కొని రైతు తీవ్రంగా గాయపడి అవస్మారక స్థితికి చేరుకున్న సంఘటన, గురువారం మొలకలచెరువు మండలంలో జరిగింది. బాధితుడి కుటుంబీకుల కథనం మేరకు.. మండలంలోని సోంపల్లి పంచాయతీ, బిల్లు పల్లెకు చెందిన రైతు వెంకటరమణ(60) ఉదయం పొలం వద్దకు వెళ్లి పాడియావులకు గడ్డి కోసుకుని బైకులు ఇంటికి తీసుకు వస్తుండగా, మార్గమధ్యంలోని అంగడివారిపల్లి క్రాస్ లో మరో బైకు వేగంగా వచ్చి ఢీ కొట్టి, తీవ్రంగా గాయపడ్డాడని తెలిపారు. పారితున్ని కుటుంబీకులు వెంటనే మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అనంతరం అక్కడ నుంచి తిరుపతి రుయాకు తరలించారు..