శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు ఈ మేరకు శనివారం కమిషనరేట్ కార్యాలయంలో రెండు జిల్లాల పరిధిలోని హిందూ ముస్లిం క్రిస్టియన్ల మత పెద్దలతో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి అని అన్నారు. గత ఏడాది కమిషనరేట్ పరిధిలో 4786 వినాయక విగ్రహాలు రెండు జిల్లాలలో ఏర్పాటు చేశారని ఈ ఏడాది మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులతో పాటు పలువురు పాల్గొన్నారు.