పత్తి దిగుమతులపై 50 శాతం పన్ను విధించాలని, కేంద్ర ప్రభుత్వం పత్తిపై 11 శాతం దిగుమతి సుంకాన్ని తొలగిస్తూ విడుదల చేసిన నోటిఫికేషన్ వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం సూర్యాపేట ఆర్డీవో కార్యాలయం ముందు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్ కే యం ) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.