సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం మధుర గ్రామ శివారులోని దత్తాత్చల క్షేత్రంలో శ్రావణమాసం సందర్భంగా శుక్రవారం పత్రిక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు సభాపతి శర్మ మాట్లాడుతూ శ్రావణమాసం సందర్భంగా ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. పూజా కార్యక్రమాల అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించగా భక్తుల అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.