గంగవరం: మండలం స్థానికులు తెలిపిన సమాచారం మేరకు. మామడుగు పంచాయతీ సామర్లగడ్డ గ్రామానికి చెందిన పవన్ ఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో పని చేస్తూ, వృత్తి నిమిత్తం గ్రామం నుండి బైక్ పై ప్రయాణిస్తూ పలమనేరు అటవీ పరిధి మొగిలి ఘాట్ వద్ద ట్రైన్ చక్రాలు తరలిస్తున్న లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారన్నారు. కాగా చేతికి వచ్చిన కుమారుడు అర్ధాంతరంగా తనువు చాలించడంతో ఆ కుటుంబం కన్నీటి పర్యంతమయ్యారు.