కుటుంబ కలహాల నేపథ్యంలో రేపల్లె పట్టణంలోని 18వ వార్డు, అరుంధతి నగర్ లో కారుమూరు కోటేశ్వరరావు అనే వ్యక్తి సోమవారం తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రేపల్లె పట్టణ పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కోటేశ్వరరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడా, ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే దానిపై పోలీసులు ఆరాధిస్తున్నారు.