గుత్తి లోని గాంధీ సర్కిల్ సమీపంలో ఉన్న అంబేద్కర్ కూరగాయల మార్కెట్ చాలా అధ్వానంగా తయారైంది. పైప్లైన్ లీకేజీ కావడంతో నీరంతా మార్కెట్లోకి చేరింది. మార్కెట్ మొత్తం చిత్తడిగా మారిపోయింది. దీంతో ఊరగాయలు కొనుగోలు కోసం మార్కెట్కు వస్తున్న జనాలు ఇబ్బందులు పడుతున్నారు. నీళ్లు, బురద ఉండడంతో జనాలు అవస్థలు పడుతున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి మార్కెట్ ను శుభ్రం చేయించాలని వ్యాపారులు, ప్రజలు కోరుతున్నారు.