ఎల్లారెడ్డి : పాత్రికేయ వృత్తికి న్యాయం చేస్తున్నందుకే ఎల్లారెడ్డికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ రాజేందర్ నాథ్ కు మంచి గుర్తింపు పొందారని రాష్ట్ర బీజేపీ నేత, మాజీ టెలికామ్ బోర్డు సభ్యులు మర్రి బాలకిషన్ అన్నారు. నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ (ఇండియా)ఉపాధ్యక్షుని హోదాలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి, జర్నలిస్టుల సమస్యలపై చర్చించినందుకు, బీజేపీ కార్యాలయంలో బీజేపీ నేతలు సత్కరించారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు దేవేందర్, రాజేష్, పద్మ శ్రీను, ఎస్ ఎన్.రెడ్డి, వంగపల్లి కాశీనాథ్, అల్లం పండరి, గజనన్ పాల్గొనారు.