వరద బాధిత రైతులకు లబ్ది కలిగేలా పొలాలలో వేసిన ఇసుక మేటల తొలగింపు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో జిల్లా కలెక్టర్ లింగంపేట మండలం బురిగిద్ద గ్రామంలో ఇటీవల సంభవించిన అధిక వర్షాల సమయంలో వచ్చిన వరదలతో ఇసుక మేట వేసిన రైతు సభావత్ లక్ష్మి వారి పొలంలో ఈజీఎస్ ద్వారా చేపట్టిన ఇసుకమేటల తొలగింపు కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధిత రైతుతో మాట్లాడి అధైర్య పడవద్దని మీ పొలంలో ఇసుక మేటల తొలగింపునకు ఈజీఎస్ ద్వారా ఉపాధి హామీ కూలీలకు 1 లక్ష 21 వేల రూపాయల కూలీ డబ్బులను చెల్లించడం జరుగుతుందని తెలిపారు.