గ్రూప్స్ పరీక్షల పై కోర్టు నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలని, కోర్టు నిర్ణయాన్ని దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పరీక్షలు రద్దు చేయాలనే అంశంపై రాక్షసానందం పొందుతున్నారని.. ఇది దురదృష్టకరం అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తాము ఎక్కడా ఇబ్బందులు లేకుండా చాలా పారదర్శకంగా పరీక్షలు నిర్వహించేలా చేస్తున్నామని, న్యాయ పరమైన అంశాలను అధిగమించి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శుక్రవారం హుస్నాబాద్ నియోజకవర్గంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ..